Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తిప్పర్తి
మండలం లోని రాజు పేట గ్రామంలోప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చరాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో అందరూ బాగా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని ఆయనలాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివద్ధి కొరకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఆర్థికంగా నిధులను మంజూరు చేస్తూ రాష్ట్రానికి గ్రామాలే పట్టుకొమ్మలు అనే విధంగా పూర్తిస్థాయిలో అభివద్ధి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ మండల నాయకులు వివిధ గ్రామ సర్పంచులు ,ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాశం రామ్ రెడ్డి, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, లింగారావు, తదితరులు పాల్గొన్నారు.