Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి
- రైతు భరోసా యాత్రలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ -పాలకుడు
హుజూర్‌నగర్‌లో తాను 50వేల మెజార్టీతో గెలుపొందుతానని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని గురుగుంట్లపాలెం, సింగారం,, పాలకీడు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కౌలు రైతులను, గాలికొదిలేశారన్నారు. దేశంలో పంట భీమా లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. సీఎం నుండి ఎమ్మెల్యే వరకు దాచుకో దోచుకో అన్న తీరున పాలనను కొనసాగిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఒకేసారి ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, పెట్టుబడికి ఎకరానికి 15 వేల రూపాయలు, భూమి లేని రైతుకూలీ లకు సంవత్సరానికి పన్నెండు వేల , కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, పండించిన వరి ధాన్యానికి చత్తీష్‌ఘడ్ తరహాలో క్వింటాకు రూ.2500వఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందన్నారు. టీిఆర్‌ఎస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని.. సమభావన సంఘాలకు మూడు వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డ ప్రభుత్వం, అభయ హస్తం డబ్బును తిరిగి వెనక్కి ఇవ్వలేన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోస్థానిక ఎమ్మెల్యే ఆగడాలకు అంతు లేకుండా పోయిందన్నారు. దౌర్జన్యంగా భూ అక్రమాలు, ఉసిక మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు.. తీసుకునే స్థాయికి దిగజారి.. ప్రశ్నించే ప్రజలను అణచి వేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలోని చెక్ డ్యామ్ ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై, నాబార్డ్నిధులు విషయంపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామన్నారు. దీనిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు, ఎంపీపీ గోపాల్ నాయక్, బెట్టే తండా సర్పంచ్ మోతిలాల్, జనార్ధన చారి, భాస్కర్ రెడ్డి, బూచి పల్లి వెంకటరెడ్డి, జితేందర్ రెడ్డి, బెల్లంకొండ నరసింహారావు పాల్గొన్నారు.