Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బీబీనగర్
గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికే టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా క్రీడా మైదానాలు ఏర్పాటుచేస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని మీదితండ గ్రామ పంచాయతీ పరిధిలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన పిదప గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయన్నారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన క్రీడా ప్రాంగణంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సరాదాగా క్రీడలు ఆడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ తివారి, ఎంపీపీ ఎరుకలి సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతపింగల్రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్‌ఛైర్మన్ ఆల్వ మోహన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ ధరావత్ జయమ్మవెంకటేశ్, ఎంపీటీసీ భీమ్లానాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాచమల్ల శ్రీనివాస్, చింతల సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.