Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-దేవరకొండ
పట్టణ ప్రగతి తో పట్టణాలు అభివద్ధి చేయడం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని 4వవార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడుతూ......పట్టణంలోని సమస్యలను పరిష్కరించేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రభుత్వం తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణంలో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పట్టణాల అభివద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం, మున్సిపల్ చైర్మన్ ఆల్లంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకష్ణయ్య, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కష్ణయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడిత్య దేవేందర్, స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ రైస్, పొన్నబోయిన సైదులు, మూడావత్ జయప్రకాష్ నారాయణ, జింకల లింగయ్య, కమిషనర్ వెంకటయ్య, బోడ్డుపల్లి కష్ణ,తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం
మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కషి చేస్తుందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75మందికి రూ.75లక్షల చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కానుకగా చెక్కుతోపాటు చీర అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....దేవరకొండ మండలంలో ఈరోజు వరకు 1624మందికి రూ.14.50కోట్లు కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందించడం జరిగిందని ఆయన అన్నారు. కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకష్ణయ్య,ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్,జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కష్ణయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వాడిత్య దేవేందర్,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నేనావత్ శ్రీను,పొన్నబోయిన సైదులు,మూడవత్ జయప్రకాష్ నారాయణ,వాడిత్య దేవేందర్, తహసీల్దార్ కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.