Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కోదాడరూరల్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా డబుల్బెడ్రూం ఇండ్ల్ల లక్కీ డ్రా నిర్వహించామని ఆర్డీఓ లక్కినేని కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఆయా గ్రామాల, ప్రజా ప్రతినిధులు,మండల అధికారులు, లబ్దిదారుల సమక్షంలో నడిగూడెం మండలం లోని కాగిత రామచంద్రాపురం సిరిపురం గ్రామాల రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల డ్రా నిర్వహించి ఆయన మాట్లాడారు. డ్రా లో ఇండ్లు వచ్చిన వారికీ త్వరలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల తో మేరకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో ఇళ్లను అప్పగిస్తామన్నారు. లక్కీ డ్రా లో ఇల్లు రానివారు నిరుత్సాహ చెందవద్దని మరోదఫా లో అర్హులైన వారికి తప్పకుండా ఇండ్లలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. కాగిత రామచంద్రపురం లో 40 మందికి సిరిపురం లో 40 మందికి లక్కీడ్రా ద్వారా రెండు పడక గదుల ఇల్లు ఖరారు చేసినట్లు తెలిపారు. లక్కీ డ్రా లో ఇల్లు రాణి లబ్ధిదారులు కొంతమంది నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం ఎంపీపీ జ్యోతి మధు బాబు, తహసిల్దార్ నాగేశ్వరరావు, డిప్యూటీ జవహర్ నాయక్, కలెక్టరేట్ అధికారి అబ్దుల్లా, డిప్యూటీ డి.ఎస్.ఓ జవహర్ నాయక్, ఆర్ సి పురం సర్పంచ్ మంచికంటి వెంకట్ రెడ్డి, సిరిపురం సర్పంచ్ మొక్క లక్ష్మీ వీణ బిక్షపతి, ఎంపీటీసీలు గార్లపాటి మాలతీ శ్రీనివాస్ రెడ్డి, శెట్టి జ్యోతి శ్రీనివాస్,ఆర్.ఐ సరస్వతి,ఎంపీఎస్ ఓ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.