Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కార్యాలయం ముందు శుక్రవారం నాల్గో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంపై నిరసన తెలియజేస్తూ మున్సిపల్ వైస్‌ఛైర్మెన్ బత్తుల శ్రీశైలం, బీజేపీ ఫ్లోర్‌లీడర్ పోలోజు శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్ కొయ్యడ సైదులుగౌడ్, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, సందగల్ల విజయసతీశ్గౌడ్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మొక్కుబడిగా సాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంపై ఆవేదన వ్యక్తంచేస్తూ నినాదాలు చేశారు. మొదటి విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో కొంతమంది కౌన్సిలర్లు సొంత నిధులు వెచ్చించి పలు అభివద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు బిల్లులు చెల్లించలేదని తెలిపారు. దీంతో కౌన్సిలర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. చైర్మెన్, కమిషనర్ కేవలం కుర్చీలకే పరిమితమవుతున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజా సమస్యలపై చర్యలు తీసుకోకపోగా, సందర్శించిన దాఖలాలు లేవని తెలిపారు. సంబంధిత అధికారులు మున్సిపల్ అభివద్ధికి తోడ్పాటునందించాలని కోరారు.