Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు యాదాద్రి జోన్-5 అసిస్టెంట్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి పి. స్వాతి, సూర్యాపేట జిల్లా ఇన్చార్జి ఎఫ్ఎస్ఓ సిహెచ్ . కష్ణ మూర్తి ,చౌటుప్పల్ ఏసీపీ ఉదరు కిరణ్ రెడ్డి తమ పోలీస్ బందంతో కలిసి చౌటుప్పల్ పరిధిలోని పోచంపల్లి ,భీమనపల్లి గ్రామాలలో పాల కల్తీ పై ఆకస్మిక దాడులు చేశారు. చౌటుప్పల్ తదితర ప్రాంతాల నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న పాల వాహనములను , వ్యాపారస్తుల ఇండ్లను తనిఖీ చేసి సుమారు 10 అనుమానిత శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్ నాచారంలో గల స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీకు పంపించారు. వాటి ఫలితాల ఆధారంగా పాల కల్తీకి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని గత నెల రోజుల నుండి యాదాద్రి జిల్లాలో వరుస కేసులు నమోదు కావడంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్టు తెలిపారు. ఇక నుంచి కల్తీ పై ప్రత్యేక నిఘా పెట్టి తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని కల్తీకి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. స్థానిక ఎస్ఐ సైదిరెడ్డి పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.