Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కవులు కలానికి పని చెప్పాలి
- శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని కాళోజీ చెప్పినట్టు ఒక కవి రాసే రచన కొన్ని లక్షల మందిలో చైతన్యం కలిగిస్తుందని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి పట్టణంలోని జి ఏం కన్వెన్షన్ లో కవుల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై,జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగడానికి ఆనాడు కవులు రచించిన రచనలు ప్రధాన కారణమన్నారు. తెలంగాణ గడ్డ కవులకు మొదటినుండి పురిటీగడ్డఅని జయరాజ్,గోరేటి వెంకన్న ,గద్దర్ వంటి కవులు తెలంగాణ రాష్ట్రం కోసం రచనలు చేసి ఉద్యమానికి ఊపుని అందించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రములో కవుల జీవితం చాలా కష్టాల మయంగా ఉండేదన్నారు. ముఖ్యమంత్రి కూడా రచయిత కావడం వలన తెలంగాణ రాష్ట్రము వచ్జిన తరువాత కవులను కాపాడుకోవాలని వారికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ గళాన్ని వినిపించిన కవులను నేడు తెలంగాణ రాష్ట్రం గొప్పగా గౌరవిస్తుందన్నారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివద్ధిని ప్రోత్సహించే విధంగా కవులు తమ కలానికి పని చెప్పాలనిఅన్నారు. తెలంగాణ ప్రజలకు అవగాహన కలిగించే విధముగా కవులు,కళాకారులు రచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్,రాహుల్ శర్మ, జిల్లా పరిషత్ సీఈవో వీరబ్రహ్మచారి, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి,కవులు,కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.