Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపాలిటీల పరిధిలో ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ డిమాండ్‌చేశారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఎండి.పాషా అధ్యక్షతన మున్సిపల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జహంగీర్ మాట్లాడారు. ఈ నెల 5,6,7 తేదీల్లో భువనగిరి పట్టణంలోని రాయగిరిలోని రాధాకష్ణ ఫంక్షన్హాల్లో పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు పార్టీ మండలకమిటీ సభ్యులు, శాఖల కార్యదర్శులు పాల్గొనాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ కార్యకర్తలు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, నాయకులు ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, గోశిక కరుణాకర్, బొడ్డు రాజుగౌడ్, ఉష్కాగుల రమేశ్, శ్రీను, ఎమ్‌డి.ఖయ్యుమ్, భావండ్లపల్లి స్వామి, చీకూరి ఈదయ్య, చింతకింది పాండు, బొడ్డు అంజిరెడ్డి, బొమ్మకంటి కష్ణ, కొంగరి కనకయ్య, మొగుదాల రాములు, గంజి రామచంద్రం పాల్గొన్నారు.
- రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
ఆత్మకూర్ యం: యాదాద్రి భువనగిరి జిల్లా సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులను ఈ నెల 5, 6, 7 తేదీలలో భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాగ్గిర్ లోనిసోమరాధాకష్ణ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు, రాజకీయ శిక్షణ తరగతులకు పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనిరాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం)రాజకీయ శిక్షణ తరగతులు ప్రచార పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 500 మంది సీపీఐ(ఎం) నాయకత్వం స్థాయి క్యాడర్ హాజరవుతున్నారని చెప్పారు. జిల్లాలో ఎనిమిది మండలాల్లో ప్రవహించే మూసీనది పూర్తిగా కాలుష్యం అయిందని, కాలుష్యం నీరు తాగి ప్రతిపక్షం పూర్తిగా నాశనం అవుతుందని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు గోదావరి, కష్ణ నీరు అందించే మూసి రహిత జిల్లాగా మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిలిచిపోయిన గంధమల్ల ప్రాజెక్టును పనులను, 18ఏండ్లుగా అసంపూర్తిగా ఉన్న పునాదిగానే కాల్వ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ శిక్షణ తరగతులలో జిల్లా ప్రజ సమస్యలపై ఉద్యమించడం కోసం ప్రణాళిక రూపొందించనున్నట్లుఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్ పార్టీ డివిజన్ నాయకులు రచ్చగోవర్ధన్ పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం తదితరులు పాల్గొన్నారు.