Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
నల్లగొండ పట్టణంలోని ప్రతివార్డును శుభ్రంగా ఉంచుకోవాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పానగల్లు లోని 1 వ, 2వ వార్డులలో 4 వ విడత పట్టణ ప్రగతి లో పాల్గొన్నారు. పానగల్లు రిజర్వాయర్ ను ట్యాంక్ బండ్ గా మార్చాడం, దేవాలయాలను అభివద్ది చేసి పర్యాటక ప్రాంతంగా మార్చడం, వార్డులలో 15 లక్షల రూపాయలతో డ్రైనేజీ కాలువలు నిర్మించినట్టు తెలిపారు, అలాగే తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని , ప్రతి వార్డును పరిశుభ్రంగా ఉంచు కోవాలని తెలిపారు.పానగల్లు లోని 1,2,3 వార్డుల లో వంగిపోయిన కరెంటు పోల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి, వైరింగ్ ఇవ్వాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మందడి సైదిరెడ్డి మాట్లాడుతూ నేష్నల్ హైవే 565 నిర్మాణం, దేవాలయాల అభివద్ది, ఉదయ సముద్రంను పర్యాటక స్థలం గా మార్చనున్నట్టు తెలిపారు. కమిషనర్ డా.కె.వి రమణాచారి మాట్లాడుతూ నేటి నుంచి 15 రోజుల పాటు పట్టణ ప్రగతి జరగనున్నదన్నారు. వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్మాట్లాడుతూ వార్డులో పరిసరాల పరిశుభ్రత పాటించాలని, త్రాగు నీటిని క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు,తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, వార్డు కౌన్సిలర్లు ఆలకుంట్ల రాజేశ్వరి ,మోహన్ బాబు, బుర్రి రజిత ,మున్సిపల్ అదనపు కమీషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మాద్, నాగిరెడ్డి, ముస్సపల్ సిబ్బంది పాల్గొన్నారు.