Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో పల్లెలకు పట్టణాలకు మధ్యనే పోటీ
- మంచి నాగరిక సమాజమే కేసీఆర్ లక్ష్యం
- పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలకు పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక 25, 39, 9, 36 వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మంచి నాగరిక సమాజంలో తెలంగాణ సమాజం తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో మనం ఎన్నో కలలు కన్నామని రాష్ట్రం వస్తే ఎట్లా ఉంటుందని ఎట్లా ఉండాలనే దానికి ఇవాళ ఎనిమిదేండ్ల కేసీఆర్ పాలన బాటలు వేసి సంపూర్ణ విజయాన్ని సాధించిందన్నారు. అతి చిన్న రాష్ట్రమైన, వయసులో తక్కువ అయినా భారతదేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ ఒకడుగు పైన నిలబడిందన్నారు. ప్రతి గ్రామం సెగ్రిగేషన్, చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకుని తడి పొడి చెత్త సేకరణ వేరు చేస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయాన్ని గ్రామ పంచాయతీలు పొందుతున్నాయని ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఉందన్నారు. పట్టణాల్లో కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ వైకుంఠ ధామాలు, పట్టణ ప్రకతి వనాలు, నిత్యం మంచినీరు అందించే సురక్షితమైన మంచినీటి పథకాలు ఉన్నాయన్నారు. అన్నింటికి మించి మానవ జీవితానికి అత్యంత అవసరమైన ఆక్సిజన్ అందించే చెట్ల పెంపకం, అడవుల పెంపకం పట్టణాల్లో ఎటు చూసినా పచ్చదనం కనపడుతుందని తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఏండ్ల కాలంలో కెసిఆర్ నేతత్వంలో జరిగిన అభివద్ధన్నారు. మెరుగైన సౌకర్యాలు అందించాలని పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంతో కూడా తెలంగాణకు పోటీ లేదని తెలంగాణలో పల్లెలకు పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని పేర్కొన్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులంతా కషి చేస్తున్నారని అన్నారు. ఒకరికి ఒకరు పోటీ పడి పల్లె బాగుండాలని మా పట్టణం బాగుండాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇవాళ విదేశాలకు పోయినవాళ్లు, గ్రామాలను వదిలి పెట్టి పట్టణాలకు వలస వెళ్లినవారు ఇవాళ మళ్ళీ వాళ్ల జాడలు వెతుక్కుంటూ గ్రామాలకు వస్తున్నారన్నారు. ప్రభుత్వం కేవలం పథకాలను మాత్రం తీసుకువస్తుందని వాటిని అమలు చేయడంలో అధికారుల కషి చాలా ఉంటుందన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ,జిల్లా కలెక్టర్ వినరు క్రీష్ణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, అయా వార్డుల కౌన్సిలర్ ఆకుల కవితలవకుశ , కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.