Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నకిరేకల్
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శుక్ర వారం మండలం లోని నడిగూడెం గ్రామంలో పల్లె ప్రగతి, బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంపొందించడానికి, గ్రామ పంచాయతీ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములు ఉన్న చోట హరితహారం కార్యక్రమం చేపడుతామన్నారు. అభివద్ధిలో పట్టణాలతో పల్లెలు పోటీపడాలన్నదే సీఎం కెసిఆర్ లక్ష్యమన్నారు. ఈ నెల 13 నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపధ్యంలో శ్రమ దానాలు నిర్వహించి పాఠశాలల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా చూడలని ఆయన కోరారు.కార్యక్రమంలో జెడ్పిటిసి మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్. పిఎసిఎస్ చైర్మన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, జే. వెంకటేశ్వరరావు, ఎం పి ఓ నాగలక్ష్మి, సర్పంచ్ మాద నాగరాజు, కౌన్సిలర్ రాచకొండ సునీల్ పాల్గొన్నారు.
పాలెం గ్రామంలో పల్లె ప్రగతి
మండలంలోని పాలెం గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ ఏ కుల కవిత విజరు కుమార్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామ పరిసరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, యువత, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.