Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రాష్ట్రంలో ఊరూరా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్న ఘనత టీిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే,భువనగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివద్ధి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గంగసాని పల్లి, వీరవెల్లి గ్రామం లో 5 విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ క్రీడా ప్రాంగణంలను ప్రారంభించి, మాట్లాడారు. వీరవెల్లి గ్రామంలో హెచ్ఎండీఏ నిధులతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో కోలాట బందం మహిళలకు కోలాటం కర్రలు, చీరలు, గజ్జేలను ఎమ్మెల్యే సొంత నిధులతో అందజేశారు. పట్టణ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఊరూరా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిన ఘనత దేశంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీబీరు మల్లయ్య, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, సర్పంచ్ తంగనపల్లి కల్పన శ్రీనివాసచారి, ఎంపీటీసీ కంచి లలితమల్లయ్య, సర్పంచ్ రాంపల్లి నగేశ్, ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ, బ్యాంకు మాజీ చైర్మెన్ మధుసుదన్‌రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల మాస రమేష్ గౌడ్,, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు మండల కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్ , మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కంచి మల్లయ్య, పాల్గొన్నారు.