Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ హిందూ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలి
- బీజేపీ యేతర పార్టీలపై కక్ష పూరిత ధోరణి ప్రదర్శిస్తుంది
- మునుగోడు, దేవరకొండ లో సీపీఐ పాగా వేస్తాం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి
నవతెలంగాణ -మునుగోడు
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీి ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా సంస్కరణల పేరుతో ఆర్థిక పారిశ్రామిక సాంస్కతిక రంగాలలో తిరోగమన విధానాలు చేపడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి విమర్శించారు. చాపకింద నీరులాగా హిందూ మతోన్మాద విధానాలను ప్రోత్సహిస్తూ లౌకిక ప్రజాస్వామ్య జాతీయ విధానానికి బంగారం కలిగించే విధంగా విధానాలు చేపడుతుందన్నారు. ఆ పార్టీ నల్లగొండ జిల్లా 22వ మహాసభ శనివారం మునుగోడులోని గులాం రసూల్ ప్రాంగణంలో నిర్వహించారు. మొదటి రోజు ప్రతినిధుల సభ ప్రారంభించారు. ఈ సభకు ముందు ఆ పార్టీ సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతినిధుల మహా సభలో ప్రారంభోపన్యాసం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ హిందూ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలపై మరింత పన్నుల భారం మోపిందన్నారు. కార్మికుల హక్కులను హరించే విధంగా 44 చట్టాలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. బీజేపీి యేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షపూరిత ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ తోపాటు దేశ అభివద్ధిలో ప్రధాన వనరులైన విమానయాన రైల్వే నౌకాయాన రోడ్డు రవాణా తదితర సమస్యలను ప్రయివేటు సంస్థలకు లీజ్ కు ఇచ్చి తమ బాధ్యతల నుండి తప్పించుకున్నారన్నారు.. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు పొందుపరిచిన హామీల అయినా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ట్రైబల్ యూనివర్సిటీ చేపట్టకుండా మొండి చేయి చూపిందన్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో లో కష్ణా గోదావరి నదులపై చేపట్టిన ప్రాజెక్టును స్వాధీనం చేసుకుని రాష్ట్రాలకు అధికారాలపై పెత్తనం చేయాలని చూస్తోందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్పై రోజురోజుకు ధరలు పెంచుతూ ప్రజలపై ఎనలేని మోయలేని భారం మోపిందన్నారు. రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలపై సబ్బండ వర్గాలు ఏకమై ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో ఎనిమిది సంవత్సరాలుగా టీిఆర్ఎస్ ప్రభుత్వం ఆ వైపు కన్నెత్తి చూడలేదన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాకు చెందిన ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి గురి చేస్తుందని ఆరోపించారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కార్యదర్శి పార్టీ కార్యకలాప నివేదికను చదివి వినిపించారు. ప్రతినిధుల మహాసభ కు అధ్యక్షవర్గం పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, గిరి రమ వహించగా సీనియర్ నాయకులు , మల్లేపల్లి ఆదిరెడ్డి రాష్ట్ర కర్యవర్గ సభ్యులు పల్లా నర్సింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్ ,ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్దే శ్రీనివాస్,కార్యదర్శి పల్లా నర్సింహ, బిసిసాధనసమితి రాష్ట్రకార్యదర్శి రయబండి పాండురంగ చారి, జిల్లా కార్యవర్గ సభ్యులు మందడి నర్సిహ్మారెడ్డి, పబ్బు వీరస్వామి, గురిజ రామచంద్రం, బొల్గురి నర్సింహ, బొడ్డుపల్లి వెంకట్ రమణ, తదితరులు పాల్గొన్నారు.