Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మినట్టయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి బి.వెంకటేశ్వర్రావు తెలిపారు. శనివారం మున్సిపల్ కేంద్రంలోని విత్తన డీలర్ల షాపులలో టాస్క్ ఫోర్స్ అధికారులు, మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజుతో కలిసి తనిఖీలు నిర్వహించారు. వివిధ షాపుల్లో విత్తనాలకు సంబంధించిన పత్రాలు, లైసెన్సు కాపీలను తనిఖీచేశారు. ధనలక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షాపులో శ్రీ మహాలక్ష్మీ సీడ్స్ కంపెనీకి సంబంధించిన పత్తి విత్తనాలకు సరైన పత్రాలు లేనందున వాటికి సంబంధించిన 60 ప్యాకెట్ల అమ్మకాలను నిలిపివేసినట్టు తెలిపారు. అదే విధంగా నవత ఆగ్రో డివిజన్ షాపులో రికార్డులు సరిగా లేనందున అమ్మకాలు చేయకూడదని, రికార్డులు, రిజిస్టర్లు అప్డేట్ చేసిన తర్వాత అమ్మకాలు చేయాలని ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు అధీకత డీలర్ల వద్ద తీసుకోవాలని, ఖచ్చితంగా బిల్లు, రశీదు పొందాలని తెలిపారు. ఈ తనిఖీల్లో ఏఓ యాదగిరిరావు, సిబ్బంది ఉన్నారు.