Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోటకొండూరు
కెజీకెఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల8న మండల కేంద్రాలలో నిర్వహించనున్న ధర్నాలో గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయ రాములు గౌడ్ కోరారు. శనివారం మండలకేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 5 లక్షల మంది కల్లు గీత కార్మిక కుటుంబాలు వత్తి చేస్తూ జీవిస్తున్నాయి అని వారి సంక్షేమానికి ప్రభుత్వం నిధులు కేటాయించకుండా కార్మికులను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం గీత కార్మికులు ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో కల్లుగీత కార్మికులు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 50 ఏండ్లు నిండిన కార్మికులకు నాలుగేండ్ల నుండి పెండింగ్లో ఉన్న పింఛన్ ఇవ్వాలని, ద్విచక్ర వాహనాలు వెంటనే ఇవ్వాలని, రూ.10లక్షల చొప్పున గీతన్నబంధు ఇవ్వాలని కోరారు.