Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్నేహితుడే నమ్మించాడు నరికేశాడు
- ప్రేమ, ఆర్థిక వ్యవహారాల కారణం..?
నవ తెలంగాణ- కట్టంగూరు
ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడ్డ ఆర్థిక, ప్రేమ వ్యవహారం వ్యక్తి దారుణ హత్యకు దారి తీసిన సంఘటన కట్టంగూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఐదు రోజుల క్రితం జరిగిన హత్య ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, మతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐటిపాముల గ్రామ శివారులో రసూల్ గూడెం గ్రామానికి చెందిన బెజవాడ రాజశేఖర్ (26) రామచంద్రపురం గ్రామానికి చెందిన నందికొండ వెంకన్న 15 ఏండ్ల్లుగా 6వ తరగతి చదివే నాటినుండి స్నేహితులుగా కలిసి మెలిసి ఉండేవారు. మతుడు రాజశేఖర్ గ్రామం లోనే ఉంటూ డ్రైవర్ గా పని చేస్తూ ఫైనాన్సు లావాదేవీలు చేస్తూ ఉండేవాడు. ఇటీవల తన స్నేహితుడైన వెంకన్నకు లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడు.ఈ డబ్బులు ఇవ్వాలని రాజశేఖర్ తన స్నేహితుడిని తరచుగా అడిగేవాడు. సమీప గ్రామానికి చెందిన ఒక యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమిస్తున్నారు. ఆ యువతి రాజశేఖర్‌కి దగ్గరగా ఉండడంతో వెంకన్న జీర్ణించుకోలేకపోయాడు. రాజశేఖర్‌ని ఎలాగైనా హతమార్చాలని పథకం వేసుకున్నాడు. గత నెల 31న వెంకన్న, రాజశేఖర్ కి ఫోన్ చేసి ఐటిపాముల గ్రామానికి రావాలని తాటి ముంజలు కొట్టు ఇస్తానని పిలిచాడు. రాజశేఖర్ రావడంతో అతని బైక్ పైన వెంకన్న ఐటిపాముల శివారులోని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. వెంకన్న తనవద్దనున్న ముంజ కొడవలితో రాజశేఖర్ మెడను నరికివేశాడు. దీంతో రాజశేఖర్ అక్కడికక్కడే మతి చెందాడు. సమీపంలోని వాగు వద్ద గొయ్యి తీసి రాజశేఖర్ మతదేహాన్ని పాతి పెట్టాడు. ఎవరికి అనుమానం రాకుండా గొయ్యి పైన తాటాకులు పరిచాడు. ఇదిలా ఉండగా మతుడి అన్న నర్సింహ తన తమ్ముడు కనిపించడం లేదంటూ ఈ నెల ఒకటో తేదీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అనుమానంతో వెంకన్నను విచారణ చేయగా తానే చంపినట్టు ఒప్పుకున్నాడని తెలిసింది. మతదేహాన్ని పూడ్చిన స్థలాన్ని చూపించడంతో తహసీల్దార్ దేశ్యా నాయక్ సమక్షంలో మతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమైనట్లు తెలుస్తుంది.