Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హుజూర్నగర్
విద్యార్థులు పట్టుదలతో ఏకాగ్రతతో చదివి లక్ష్య సాధనకు కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణాశిబిరాన్ని ఆయన సందర్శించి శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ర్థులకు కుటుంబ విలువలు తెలియజేస్తూ వారు కుటుంబంలో తల్లిదండ్రులకు చేయూతగా ఉండాలన్నారు.విద్యార్థు నాకు విద్య అనేది చీకటిని తొలగించే ఒక వెలుగు లాంటిదని విద్యార్థులను విజ్ఞానవంతులుగా చేయటానికి జీవితంలో ఒక ఉన్నతమైన వ్యక్తులు ఎదగడానికి వైద్య అనే ఒక చక్కని సాధనమన్నారు.ఉద్యోగాలు వచ్చినప్పటికీ రాకపోయినప్పటికీ నిరాశ నిస్పహలకు గురి కావలసిన అవసరం లేదన్నారు నేడు ఐటి రంగం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరించిందని ఐటీ రంగంలో ఉద్యోగాలకు కొదవ లేదన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జదీపికాయుగంధర్‌రావు, ఫ్యాకల్టీలు తదితరులు పాల్గొన్నారు.