Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
కాంగ్రెస్‌తోనే రైతురాజ్యం వస్తుందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.శనివారం రైతు రాజ్యం కోసం చేపట్టిన రచ్చబండ కార్యక్రమం సందర్భంగా మండలంలోని చింతకుంట్ల, గుమ్మడవెల్లి ,దేవితండా, సీఏపల్లితండా తదితర గ్రామాల్లో రైతులతో ముఖాముఖి మాట్లాడారు.2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.ప్రతి కౌలు రైతుకు కూడా 15 వేల రూపాయలు అందజేస్తామని, అదేవిధంగా భూమిలేని ప్రతివ్యక్తికి ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామన్నారు.రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్‌రెడ్డి,ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాయక్ ,జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ ఎన్.కిషన్‌నాయక్, వైస్‌ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు,పీఏసీఎస్ చైర్మెన్ దూదిపాల దేవేందర్‌రెడ్డి,డి.సిరాజ్‌ఖాన్, కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు వేమన్‌రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు ఇస్లావత్ రాకేష్‌నాయక్, గడ్డంశ్రీరాములు, పంది రుద్రమ్మ,లచ్చీరాం,బొడ్డుపల్లి సైదులు, ఏకుల సురేష్, యాదయ్య,శ్రీనివాస్ పాల్గొన్నారు.