Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- సందడి చేసిన సినీ నటులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణంలోని స్థానిక సాగర్‌రోడ్‌లో నూతన ''ది చెన్నరు షాపింగ్‌మాల్''ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్ధన్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్‌తో కలిసి ప్రారంభించారు.అంగరంగ వైభవంగా తలుకు బెళుకులతో కనుల విందుగా షాపింగ్ మాల్ ప్రారంభమైంది.సినీనటులు శ్రీ వైష్ణవితేజ్, కతిశెట్టి సందడి చేశారు.మేనేజింగ్ డైరెక్టర్లు ఎం.వెంకట్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి మాట్లాడుతూఅన్ని వర్గాలకు అందుబాటులో ధరలు నాణ్యమైన సాంప్రదాయ వస్త్రాలను బంగారు ఆభరణాలను మోడల్ ఫ్యాషన్ అందించడంలో చెన్నై షాపింగ్ మాల్ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.