Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గసభ్యులు పాలడుగు నాగార్జున
నవతెలంగాణ-మర్రిగూడ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడేది ఎర్రజెండా ఒక్కటేనని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు.శనివారం మండలకేంద్రంలో నిర్వహించిన పార్టీ మండలకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రంలో మత రాజకీయాలు చేస్తూ యువత చెడుదారిన నడిపించే ప్రయత్నంలో బీజేపీ పాల్పడుతోందని మండిపడ్డారు.పెరిగిన నిత్యావసర ధరలు, డీజిల్,పెట్రోల్,గ్యాస్ ,మంచినూనెను వెంటనే తగ్గించాలన్నారు.అదేవిధంగా కార్మిక చట్టా లకు తూట్లు పొడుస్తున్నాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు ప్రయివేట్పరం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని హెచ్చరి ంచారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండలకమిటీ సభ్యులు నీలకంఠం రాములు, మైలసతయ్య, చెల్లం ముత్యాలు, ఉప్పునూతల వెంకటయ్య, ఊరిపక్కబద్రి, గడగోటి వెంకటేష్, గిరి, వెంకటయ్య, ఈసం దేవదానం పాల్గొన్నారు.