Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌రూరల్
తెలంగాణపై కేంద్రప్రభుత్వం కపటప్రేమ చూపిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.శనివారం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలపరిధిలోని లకారం, శ్రీనివాసాపురం, అన్నారం, గ్రామాలల్లో పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికతో కలిసి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం అమరవరం గ్రామంలో జరిగిన సభలో ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.కేవలం ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికై 24 గంటల ఉచితకరెంటు వంటి ధాన్యం కోనుగోలు కేంద్రం ఏర్పాటుతో వ్యవసాయ రంగంలో పెనుమార్పులు వచ్చాయన్నారు.తద్వారా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరిగి ఇతర ఆస్థుల విలువ రూ.కోట్లలో పెరిగిందన్నారు. అమరవరం గ్రామానికి ప్రతి రైతుబంధు కింద రూ.పది కోట్లు, రైతుబీమా రూ.1.70 కో ట్లు, మిషన్ భగీరధకు రూ.1.40 కోట్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద రూ.2 కోట్లపైనే నిధులు వచ్చాయన్నారు.కేవలం ఒక గ్రామానికి ఇంత నిధులు విడుదల కావడం స్వరాష్ట్రం వచ్చాకే సాధ్యమైందన్నారు.ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సీసీరోడ్లు, వైకుంటదామాలు, పల్లెప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు వంటి ఏర్పాట్లతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.లింగగిరి టు అమరవరం రోడ్డు కూడా మంత్రి సహకారంతో పూర్తి చేస్తా మన్నారు. అభివృద్ధిలో గత ప్రభుత్వాలు, పాలకులు చేసేదేమీ లేదన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గూడెపు శ్రీను, జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడెం గోపిరెడ్డి, సర్పంచులు గుజ్జుల సుజాత అంజిరెడ్డి, గుండెపంగు సౌజన్య, పత్తిపాటి రమ్య నాగరాజులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.