Authorization
Sat March 22, 2025 06:18:03 am
- ప్రయివేట్‌కు దీటుగా బోధన
- ప్రతిరోజూ ప్రత్యేకతరగతులు
- రుచికర భోజనం, సకలవసతులు
- 6 నుంచి 8 వరకు ఆంగ్ల మాద్యమంలో బోధన
నవతెలంగాణ-తిరుమలగిరి
మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 6,7,8వతరగతుల్లో ప్రవేశాలకు దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారిని రాపోలు సుస్మిత మంగళవారం ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ఆరవ తరగతి లో 40 సీట్లు 7వ తరగతి లో 20 సీట్లు 8వ తరగతి లో 13 సీట్లు మొత్తం 73 సీట్లు ఆంగ్లమాధ్యమంలో ఖాళీగా ఉన్నా యన్నారు.9వ తరగతిలో 20 సీట్లు తెలుగు మాధ్యమంలో ఖాళీగా ఉన్నాయని వివరించారు. పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పోషకాహారంతో మంచి భోజనం, ఉచిత యూనిఫామ్స్, టెక్స్ట్‌బుక్స్, నోట్‌బుక్స్, కెేసీఆర్కిట్స్, ప్రత్యేక అనుభవం కలిగిన ఉపాధ్యాయునిలచే బోధన, కార్పొరేట్ తరహాలో వసతులు కల్పిస్తు న్నామన్నారు. మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను ఉన్నత విద్యా వంతులుగా తీర్చి దిద్దేందుకు కస్తూర్బా పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తు న్నామన్నారు.వివిధ పోటీ పరీక్షలతో పాటు పదోతరగతిలోనూ జిల్లాస్థాయి ర్యాంకులు సాధించే దిశగా, ఉపాధ్యాయులు మరింత ప్రోత్సాహకరంగా తరగతులు నిర్వహించడం జరుగు తుందన్నారు .ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ఆరవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో చక్కని విద్యను బోధించడం జరుగు తుందని తెలిపారు.విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోగలరని తెలిపారు.