Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ఆర్టీసీ బస్సులను ఫాస్ట్‌ట్రాక్ రీచార్జ్ చేయకపోవడంతో 5 ఆర్టీసీ బస్సులని టోల్ గేట్ యాజమాన్యం నిలిపివేయడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డ సంఘటన గూడూరు టోల్ ప్లాజా వద్ద జరిగింది ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ హన్మకొండ జనగామ యాదగిరిగుట్ట డిపోలకు చెందిన బస్సులు నిత్యం ఈ టోల్ ప్లాజాల నిర్వాహకులు నిలిపివేశారన్నారు. దీంతో ఆలేరు మండలం నుండి హైదరాబాద్ ఆర్టీసీ బస్సులలో వెళ్తున్న ప్రయాణీకులు ఇతరులు గర్భిణీలు విద్యార్ధులు ప్రయాణీకులు ఉద్యోగస్తులు సమయానికి గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చిన్న నిర్లక్ష్యం పేను సమస్యలకు దారి తీస్తుంది అచ్చం అలాంటిదే తెలంగాణ ఆర్టీసీ వారి నిర్లక్ష్యం టోల్‌ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సులు, వాహనాలు వేచి చూడకుండా భారత ప్రభుత్వం ఫాస్ట్ టాగ్, ఆటోమేటిక్ టోల్ రుసుము సౌకర్యం తెచ్చింది , దానిని తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని ,ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ బ్యాలెన్స్ చేయకుండా బస్సులు నడిపిస్తుందని ప్రయాణికులు వాపోయారు . ప్రయాణికులు బస్సు ఎక్కగానే డబ్బులు వసూలు చేసి సంచిలో వేసుకుని టికెట్ ఇచ్చే ఆర్టీసీ వారు బస్సు బయలుదేరే ముందు ఫాస్ట్ టాగ్ రీఛార్జ్ చేయకుండా బస్సు నడపడం వలన టోల్ ఫ్లాజ దగ్గర బాలన్స్ లేకపోవడంతో దాదాపు 30 నిముషాలు పైగా బస్సులు నిలిచిపోతున్నాయి. అద్దె బస్సుల యాజమాన్యం ఆర్టీసీ వారి నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని తెలుస్తోంది . విద్యార్థులు,ఉద్యోగులు, ఆసుపత్రికి వెళ్లే గర్భిణీలు, రోగులు, ఇతర అత్యవసర పనులకు వెళ్లే ప్రయాణికులు మార్గమధ్యం టోల్ ప్లాజ దగ్గర చిక్కుకుపోయి ఆర్టీసీ వారి చిన్న నిర్లక్ష్యం కారణంగా ప్రజలు నిత్యం పెద్ద ఇబ్బందులకు గురవుతున్నారు .ఇకనైనా ఇలాంటి సంఘటనలు పురరావతం కాకుండా ఆర్టీసీ వారు ముందు జాగ్రత్త చూసుకోవాలని పట్టణానికి చెందిన ప్రయాణీకుడు బందెల సుభాష్ ప్రభుత్వాన్ని,ఆర్టీసీ సంస్థను కోరారు.