Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
ప్రభుత్వం గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల 50 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకున్నారని నేటికి వారికి పించన్లు అందక పోవడం విచారకరమన్నారు.ప్రమాదం జరిగిన కార్మికులకు ఇవ్వాల్సిన వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని కోరారు.టాడీఈ కార్పొరేషన్‌కు ఇచ్చిన బడ్జెట్‌ను వెంటనే విడుదల చేసి కార్మికుల సంక్షేమానికి కషి చేయాలన్నారు. గీత కార్మికులకు ఉపాధి కై కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున గీతన్నబంధువు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీటీ సూర్యకు అంందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి బట్టిపల్లి నాగమల్లయ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు బోడపట్ల జయమ్మ, జిల్లా కమిటీ సభ్యులు వెంకన్న,మల్సూర్, సోమగాని మల్లయ్య, జానయ్య, కె.లింగయ్య, పి.ఈదయ్య, అనంతుల వీరస్వామి, పి.రామకోటయ్య పాల్గొన్నారు.