Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోదాడరూరల్ :సాధారణకాన్పులకు గర్భిణులను ప్రోత్సహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం అన్నారు.మంగళవారం మండలపరిధిలోని కాపుగల్లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల శాతం పెంచాలన్నారు.గర్భిణులను 12 వారాలలోపు కేసీఆర్కిట్లో నమోదు చేయాలని, ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు పెంచాలని,లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకున్న లేదా ప్రోత్సహించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్య సేవలపై అవగాహన పెంచాలని, ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల్ని ఉధృతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సుధీర్ చక్రవర్తి, డిప్యూటీ డెమో అంజయ్య, పల్లె దవాఖాన వైద్యాధికారులు డాక్టర్.కల్యాణ్నాయక్,డాక్టర్ సుమంత్, డాక్టర్ కష్ణవేణి,సూపర్ వైజర్ సిద్ధమ్మ, ఏపీఎంఓ విజరు భాస్కర్, సీసీభాస్కర్ రాజు,యాదగిరి,ఏయన్ఎంలు భవాని, విజయలక్ష్మి, ఇందిరా,పద్మ,రూప,చంద్రకళ,జీవమ్మ,ప్రమీల,లక్ష్మీసుధ,గోపమ్మ,మాధురి,హెల్త్ అసిస్టెంట్స్ విజరుకుమార్, శ్రీనివాస్,ఫార్మాసిస్ట్ కష్ణ పాల్గొన్నారు.