Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని సువెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కె.వి శేషగిరిరావు అన్నారు.ప్రపంచం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక సువెన్ కంపెనీ ఆవరణలో మొక్కలు నాటారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కషి చేస్తున్నామని చెప్పారు.జీరో లిక్విడ్ డిచార్జ్ ప్లాంట్‌గా సువెన్ రాష్ట్రంలో గుర్తింపు పొందినదని తెలిపారు.కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తూ కంపెనీ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆధునిక టెక్నాలజీతో ఉత్పాదకను కంపెనీ సాధిస్తుందన్నారు.అనంతరం సువెన్ ఆవరణలో 200 మొక్కలను నాటామన్నారు.ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఎన్విరాల్మెంట్ మేనేజర్ పిల్లి వెంకటరమణ, ఏజీఎం పీఆర్ బూర రాములు, జీఎం వెంకటరమణ, డీజీఎంలు పీజే రాయుడు, డీవీ శేషగిరిరావు,సుధాకర్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.