Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
కొత్తగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించిన తెలంగాణ క్రీడా ప్రాంగణం పని ప్రదేశాన్ని పరిశీలించినట్టు ఎంపీడీఓ గ్యామానాయక్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం గ్రామంలోని క్రీడా ప్రాంగణం శుభ్రం చేయడమైనదని, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గా చేపట్టిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటును త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారని, దీనికి సుమారు నాలుగు లక్షల రూపాయలు అంచనా వ్యయం ఉంటుందన్నారు.ప్రాంగణంలో కబడ్డీ, వాలీబాల్, కోకో కోర్టులు, సింగిల్ ఎక్సర్సైజ్ బార్, డబల్ ఎక్సర్సైజ్ బార్, లాంగ్ జంప్, బౌండరీ చుట్టూ మొక్కల పెంపకం, ఆర్చ్ మొదలగు పనులు చేయాల్సి ఉందన్నారు. అదేవిధంగా 5వ విడత పల్లె ప్రకతి లో భాగంగా నక్కగూడెం గ్రామంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఇంజనీర్ పున్న రవి, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రామ సైదయ్య, పంచాయతీ కార్యదర్శి నెహ్రూ, నక్కగూడెం సర్పంచ్ రవీందర్, కార్యదర్శి రవి, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.