Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాములు
నవతెలంగాణ- మోటకొండూరు
ప్రతి గీత కార్మికునికి గీత బంధు పథకం తీసుకొచ్చి రూ.10లక్షలు ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి గీతా కార్మికునికీ దళిత బంధు లాగా 10లక్షల రూపాయల గీత బంధు ఇవ్వాలని. మోటార్ సైకిల్ తక్షణమే ఇవ్వాలని. ప్రమాద బీమా రూ.10లక్షలు, సాధారణ మరణానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాల వాళ్లు కల్లుగీత వత్తి పై ఆధారపడి జీవిస్తున్నారని వత్తిలో ప్రమాదం ఉందని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి కల్లు గీసే బతుకుతున్నారన్నారు. 50 ఏండ్లు పైబడిన వారికి పింఛన్ ఇవ్వాలని, సొసైటీకి ఐదెకరాల భూమి ఇవ్వాలని, నీరా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బొడిగే బిక్షపతి కోల కష్ణ, మండల నాయకులు నల్లమాస సాయిలు, కళ్లెం యాదయ్య, సీసా మల్లేష్, లోడే మల్లేష్, తండ రాములు, దూడల కొమురయ్య బోల్లేపల్లీ సత్తయ్య, లోడే ఉప్పలయ్య, వంగల స్వామి, మల్లం కష్ణ, నర్సింలు, మల్లేష్, నర్శయ్య, జహంగీర్, పాల్గొన్నారు.