Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
కార్పొరేట్‌స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే రమావత్‌రవీంద్రకుమార్ తెలిపారు.గురువారం పట్టణంలోని జంగాలకాలనీ పాఠశాలలో రూ.11.51 లక్షలతో, గాంధీనగర్ పాఠశాలలో రూ.3.54లక్షలతో, ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో రూ.39.19 లక్షలతో, వడేర వాడ పాఠశాలలో 7.92లక్షలతో చేపడుతున్న అభివద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.....కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.మన ఊరు-మన బడి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంపొందించే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం 'మన ఊరు-మన బడి' పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, రైతుబంధు మండలఅధ్యక్షులు శిరందాసు కష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్‌చైర్మన్ వాడిత్య దేవేందర్, కౌన్సిలర్లు చెన్నయ్య, మూడవత్ జయప్రకాష్ నారాయణ, మహమ్మద్ రైస్, మల్లీశ్వరిశ్రీశైలం, చిత్రం ప్రదీప్, ఎంపీడీఓ శర్మ, కమిషనర్ వెంకటయ్య, బొడ్డుపల్లి కష్ణ, ఎంఇఓ మాతనాయక్, ఏఈ లష్కర్ పాల్గొన్నారు.