Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేటరూరల్ : ఉమ్మడి సొసైటీ కింద ఉన్న పిల్లలమర్రి చెరువులో చేపల పట్టివేతన ఆపాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట మండల పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ముందు గురువారం ఉదయం రాయినిగూడెం గ్రామ చేపల సొసైటీ సభ్యులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉమ్మడి మత్చ్యా కార్మిక సంఘం సభ్యులు మాట్లాడుతూ పిల్లలమర్రి, రాయనిగూడెం గ్రామాలతో కలిపి ఉన్న ఉమ్మడి సొసైటీ పిల్లల మర్రి చెరువులో పిల్లలమర్రి ముదిరాజులు కొంతమంది దళారులతో మత్స్య శాఖ సహకారంతో కుమ్మక్కై దౌర్జన్యంగ పోలీసుల సహకారంతో చేపలు పట్టిస్తున్నారని ఆరోపించారు.వెంటనే చేపలపట్టివేతను ఆపాలని కోరారు.ఆచెరువు కింద ఉన్న సొసైటీ సభ్యులందరం తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరారు.కొన్నేండ్లుగా కలిసి ఉమ్మడిగా పిల్లలమర్రి ,రాయనిగూడెం గ్రామంలోని ముదిరాజ్ సంఘం సభ్యులు కలిసి పట్టుకుంటూ ఉండేదన్నారు.పిల్లలమర్రి ముదిరాజ్ సంఘం నాయకులు ,దళారులకు కొమ్ము కాస్తూ రాయినిగూడెం ముదిరాజ్ సభ్యులకు తెలియకుండా అక్రమంగా చేపలు పట్టడం దారుణమన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ సారగండ్ల కోటయ్య, వైస్ ప్రెసిడెంట్ నల్లమేకల వెంకన్న, సొసైటీ డైరెక్టర్ నల్ల మేకల అంజయ్య,ఇండ్ల సురేష్ ,కోల నిరంజన్ ,చంద్ర బోయిన నాగరాజు, చందన బోయిన కనకయ్య, మానక ఎల్లయ్య స్వామి, మేఖనబోయిన శేఖర్ ,సరగండ్ల సైదులు, వీర శేఖర్ నల్ల మేకల లచ్చయ్య, చందనబోయిన కిరణ్,మంత్రి జానయ్య,సైదులు, మల్లమ్మ,ఎల్లమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.