Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్ల
పల్లెప్రగతి తెలంగాణ రాష్ట్రంలో అట్టర్ ప్లాప్ అయ్యిందని, వ్యవసాయ సహకార సంఘాల్లో అవినీతిపై చర్యలు శూన్యమని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.గురువారం జరిగిన రైతుభరోసా యాత్ర, రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.నా స్వంత ప్రయోజనాలకు మీ దగ్గరకు రాలేదని, మీ దగ్గరకు ఓట్ల కోసం కూడా రాలేదన్నారు.మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ సాధక బాధకాలు తెలుసుకొని మీకు అండగా ఉండటానికి వచ్చానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం పల్లె ప్రగతి కార్యక్రమం కాదని అది సర్పంచ్ లను ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమం అన్నారు. నాలుగవ పల్లె ప్రగతి కార్యక్రమం లో ఖర్చు పెట్టిన బిల్లులు ఇప్పటివరకు సర్పంచ్ లకు అందచేయకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. దీని వలన సర్పంచ్ లు అప్పుల పాలు అయి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజార్చారు అని విమర్శించారు. మండలంలో ఉన్న రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సైది రెడ్డి%డ% కో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని అన్నారు. ఈ అవినీతి గురించి ఆయా సంఘాల డైరెక్టర్లు పిర్యాదు చేసినా జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. న్యాయం , ధర్మం పాటిస్తూ చట్టానికి లోబడి పని చేయాల్సిన పోలీసులు టీఆర్ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలి అన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 50000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రైతు బంధు కంటే మెరుగైన పథకం తీసుకు వచ్చి 15000 రూపాయలు ఇస్తామని అన్నారు. కౌలు రైతులకు పంట రుణాలు అందజేస్తాం అన్నారు. అదే విధంగా వరికి ఒక క్వింటాల్ కి 2500 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తాం అన్నారు. అంతే కాకుండా మహిళలకు వడ్డీ లేని ఋణాలను అందజేస్తాం అని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేసిన అభయ హస్తం పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని పునరుద్ఘాటించారు.
- కాంగ్రెస్‌తోనే రైతురాజ్యం సాధ్యం
చింతపల్లి : కాంగ్రెస్‌తోనే రైతురాజ్యం సాధ్యమని నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమారరెడ్డి అన్నారు.వరంగల్ రైతు డిక్లరేషన్‌ను గురువారం మండలంలో తీదేడు (వెంకటంపేట,) గ్రామంలో జరిగిన రచ్చబండలో గ్రామ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులకు ఆయన వివరించారు.అనంతరం ఆయన రైతు డిక్లరేషన్ జిల్లా ఇన్చార్జి వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌తో కలిసి మాట్లాడారు.కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసిన ప్రతిఒక్క అంశాలను మొదటి నెలలోనే నెరవేరుస్తామన్నారు.ఏకకాలంలో రెండు లక్షల రూపాయల. తక్షణ రుణమాఫీపై మొదటి సంతకం ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్‌లాల్‌నాయక్, నేనవత్ కిషన్‌నాయక్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మాధవి, ఎంపీపీ భవానిపవన్, టీపీసీసీ అధికార ప్రతినిధి సిరాజ్‌ఖాన్,మల్లేపల్లి పీఏసీఎస్ చైర్మెన్ వేణుధర్‌రెడ్డి,పీఏసీఎస్ జాలే నరసింహారెడ్డి,తీదేడు సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు తిరుమని పాపయ్య, మండల అధ్యక్షులు గోవర్ధన్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.