Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ రాష్ట అధ్యక్షులు కె.వెంకట్
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని ఏన్పీఆర్డీ రాష్ట అధ్యక్షులు కె వెంకట్ అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులు గురువారం రెండవ రోజుకు చేరుకున్నాయి . ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వికలాంగులను విస్మరిస్తున్నదని,రాజ్యంగ కల్పించిన హక్కులను కల్పించడం లేదన్నారు.విద్య ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు వికలాంగుల గోడును పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో దాదాపు 5శాతం మంది వికలాంగులు ఉన్నారని,వికలాంగులకు కూడు గుడ్డ ,ఇల్లు వసతులు కల్పించి వారినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. వికలాంగుల పరిరక్షణ చట్టం 2016, ప్రకారం. వికలాంగులకు ఉద్యగ ఉపాధి అవకాశాలు కల్పించాలని,5 శాతం అన్ని పతాకాలలో రిజర్వేషన్ కల్పించాలని చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించక పోవటం వలన ఆత్మ హత్యలు చేసుకుంటున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను పట్టించుకోవడం లేదని పెండింగ్ పెన్షన్లను వెంటనే మంజూరీ చేయలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి అడివయ్య, జిల్లా అధక్షుకు సురపంగ ప్రకాష్, కార్యదర్శులు వనం ఉపెందర్, కోశాధికారి బి స్వామి, రాష్ట్ర కమిటీ సభ్యులు కీసర వెం కట్ రెడ్డి, కొత్త లలిత, నాయకులు వెంకట్ నరసింహ రెడీ, ఇంజా పద్మ, అలివేలు, మాదిరి పద్మ కటపెల్లి రజిత, అనుసుజ, అంజన్ శ్రీ, సంజివ శంకర్, జొకు స్వామి, నాగరాణి రంగ సంతు తదితరుల పాల్గోన్నారు.