Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ -కట్టంగూర్
ఉపాధి హామీలో పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారిఐలయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీపనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు రోజుకు కూలీ రూ.80 నుంచి రూ.120లకు మించి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పని వద్ద టెంట్లు, మంచినీటి సౌకర్యం కల్పించడం లేదని, తట్టలు, పార పనిముట్లు అందించడం లేదని ఆరోపించారు. ఉపాధి కూలీలకు రూ.257లు ఇవ్వాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలీ రూ.600లు ఇవ్వాలని, ఉపాధి కూలీలకు వారం లోపల కూలీ చెల్లించాలన్నారు.పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బోజ్జ చిన వెంకులు, జిల్లా సహయ కార్యదర్శి చింతపల్లి లూర్ధుమారయ్య, మండల కార్యదర్శి గునుగుండ్ల రామకష్ణ, నాయకులు వద్ది అండాలు, రాంబాబు,వనం పార్వతమ్మ, కోలనిర్మల, నర్సింగ్ శ్రీను, లక్ష్మి, లింగమ్మ పాల్గొన్నారు.