Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివద్ధికి వందకోట్లు కేటాయించండి
- సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే వంద కోట్ల రూపాయలు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో మున్సిపాలిటీ యాదగిరిగుట్ట యాదగిరిపల్లి పాతగుట్ట గుండ్లపల్లి శాఖల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో డ్రయినేజీ , సీసీ రోడ్లు వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్అండ్బీ సరైన ప్రణాళిక చేయకుండా రోడ్లు వేయడం వల్ల చాలా వార్డులకు, వీధులకు దారు లేకుండా పోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ అభివద్ధితో పాటు పట్టణాన్ని అభివద్ధి చేస్తామని ప్రకటించారని,దేవాలయ అభివద్ధి చేస్తే సరిపోదని పట్టణ అభివద్ధికి తక్షణమే వంద కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళ పైన దాడి చేసిన వారు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 12 వార్డు కమిటీలను నూతనంగా ఎన్నికున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీపీిఐ మండల కార్యదర్శి బబ్బురి శ్రీధర్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, మండల కార్యవర్గ సభ్యులు పేరబోయిన మహేందర్, మునుకుంట్ల నరసమ్మ పేరబొయిన బంగారి, పట్టణ నాయకులు గోపగాని రాజు ముక్కెర్ల పెంటయ్య, గుండు వెంకటేష్, అరె పుష్ప, దండబోయిన వీరస్వామి, చందునాయక్, తదితరులు పాల్గొన్నారు.