Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ -నల్గొండ ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్ 2022) ను పకడ్బందీగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల పై ఆర్.డి.ఓ.లు,తహశీల్దార్ లు,మున్సిపల్ కమిషనర్ లు,ఎం.పి.డి.ఓ.లు,రూట్ అధికారులు, చీఫ్ ఇన్విజిలేటర్ లు,విద్యా శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈనెల 12న ఆదివారం రెండు విడతలుగా ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి 12 గంటల వరకు పేపర్1 ,అదే రోజు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో పేపర్ 1 కు 96 సెంటర్ల లో 22936 మంది విద్యార్థులు, పేపర్ 2 కు 87 సెంటర్ లలో 20543 విద్యార్థినీ,విద్యార్థులు పరీక్ష లకు హాజరవు తున్నందున, పరీక్షా కేంద్రాలలో అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్టు చేసినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేదించామన్నారు .పరీక్షల నిర్వహణకు పేపర్ 1కు ప్రధాన పర్యవేక్షకులు 96 మంది,డిపార్ట్మెంట్ అధికారులు96 మంది, రూట్ అధికారులు36 మంది,రిపోర్టింగ్ ఆఫిసర్ లు16 మంది,హాల్ సూపరింటెండెంట్ లు 287 మంది,క్లర్కు లు 96 మంది,ఇన్విజిలేటర్ లు 960 మంది ఉంటారని,పేపర్ 2 కు ప్రధాన పర్యవేక్షకులు 87 మంది,డిపార్ట్మెంట్ అధికారులు 87 మంది, రూట్ అధికారులు 36 మంది,రిపోర్టింగ్ ఆఫిసర్ లు16 మంది,హాల్ సూపరింటెండెంట్ లు 261 మంది,క్లర్కు లు 87 మంది,ఇన్విజిలేటర్ లు 870 మంది ఉంటారని అన్నారు.ముగ్గురితో ఒక బందం చొప్పున రూట్ అధికారులు కం ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రూట్ అధికారులు పేపర్ 1 కు,పేపర్ 2 కు సంబందిత పోలీస్ స్టేషన్ కస్టడీ నుండి రూట్ పరిధిలో పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రం, ఓఎంఆర్ షీట్ లు తీసుకు వెళ్లడం,తిరిగి అంద చేయడం చేయాలని, పరీక్ష లలో మాల్ ప్రాక్టీసు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కు సంబంధించి డిస్ట్రిబ్యూషన్,రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, పరీక్షా సిబ్బందికి ఆర్డర్ లు డి.ఈ. ఓ.నుండి తీసుకుని సిబ్బందికి సర్వ్ చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. తాగునీటి సౌకర్యా కల్పించాలని, వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల లోకి ప్రవేశం ఉండదన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, ఆర్డీలు జగదీశ్వర్ రెడ్డి,రోహిత్ సింగ్,గోపీ రాం, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.