Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చౌటుప్పల్ లో కొకైన్,డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు
- ముగ్గురి వ్యక్తుల అరెస్ట్,ఒకరు పరారీ
- రెండు కార్లు,60 వేల నగదు సీజ్
- వివరాలు వెల్లడించిన డీసీపీ కె.నారాయణరెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
నిషేధిత డ్రగ్స్ వాడకంతో సమాజంలో అనేక రకాల నేరాలు జరుగుతున్నాయని యాదాద్రి భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు. చౌటుప్పల్లో డ్రగ్స్ అమ్ముతున్న,కొనుగోలు చేస్తున్న వ్యక్తులను గురువారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మణిపూర్ రాష్ట్రానికి చెందిన డానియా(38) అనే మహిళ నైజీరియా దేశానికి చెందిన ఉచే జుస్టాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.ఇద్దరి కలిసి గోవాలో ఉంటూ,డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డానియా గోవా నుండి బస్సులో హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి చౌటుప్పల్ లోని హైవే పై ఉన్న ఓ హోటల్ వద్ద దిగింది. అక్కడికి హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న చేతన్, ఆదిత్యలు వేర్వేరుగా కార్లలో వచ్చి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పక్క సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో విచారించగా డానియా నేరాన్ని ఒప్పుకుంది. వీరు చాలా కాలం నుండి పింక్ పిల్స్,కొకైన్ లాంటి పౌడర్ ను అమ్మడం చేస్తున్నారు. వీరిలో డానియా,చేతన్,ఆదిత్య లను అరెస్ట్ చేశారు. ఉచే జస్ట్స్ కోసం గోవాకు పోలీస్ టీం వెళ్లింది. వీరి వద్ద నుండి రెండు కార్లు,60 వేల నగదు,20 పింక్ పిల్స్,4 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సమావేశంలో ఏసీపీ నూకల ఉదరు రెడ్డి, చౌటుప్పల్ సీఐ నేతి శ్రీనివాస్, రూరల్ సీిఐ ఎరుకొండ వెంకటయ్య,ఎస్సై దైదా అనిల్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.