Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ - భువనగిరి
ఆర్టీసి చార్జీలు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలోని బస్టాండు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీపై ఆధారపడి రూ.30 మంది ప్రయాణికులు, రూ.12లక్షల మంది విద్యార్థులు రోజువారీ ప్రయాణం చేస్తుంటారని వీరిపై ప్రభుత్వం డీజిల్ సెస్ పేరుతో రూ.2ల నుంచి రూ.5ల వరకు భారాన్ని మోపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ కార్యదర్శి మాయ కష్ణ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బందెల ఎల్లయ్య, నాయకులు వనం గిరి, సురేష్, అంజయ్య, అర్జున్ పాల్గొన్నారు.