Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవరకొండ : డిండి, దేవరకొండ,గుర్రం పోడ్ మాండలం లలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులు పరిశీలనలినల్లగొండ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టి పూర్తి చేసిన పనులను కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ బందం సభ్యులు పరిశీలించారు. శుక్రవారం డిండి ,దేవరకొండ, గుర్రం పోడ్ మండలం లలోబందం సభ్యులు పర్యటించారు.జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులు గురించి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,జిల్లా అధికారులు కేంద్రం బందం సభ్యులకు వివరించారు.తొలుత డిండి మండలం రామంతాపూర్ గ్రామంలో పర్యటించారు. కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ డైరెక్టర్ ధర్మవీర్ జా ఆద్వర్యం లో,టీం సభ్యులు హన్సల్ సుతార్, రాజ్ కుమార్ ప్రసాద్, రుచి సిన్హా లతో కలిసి పర్యటించి పరిశీలించారు . గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ చట్టం అమలు తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. అదే విదంగా ఇప్పటి వరకు గ్రామంలో ఎన్ని జాబ్ కార్డ్స్ జారీ చేశారు. ఎన్ని పని దినాలు కల్పించారు అని క్షేత్ర స్థాయి సిబ్బందిని ప్రశ్నిచారు. వాటికీ సంబందించిన రికార్డ్స్, ఫైల్స్, వర్క్ షీట్స్ ను పరిశీలించారు. అదేవిధంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్ణయించుకున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.నల్లగొండ జిల్లాలో ఈజీఎస్ ద్వారా చేసిన పనులను గురించి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కేంద్రం బందం సభ్యులకు వివరించారు.