Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
అందరి భాగస్వామ్యంతో మున్సిపాలిటీ అభివద్ధి చేసుకుందామని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి లో భాగంగా పట్టణంలోని 6, 7, 21 వార్డుల్లో పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణ గురించి వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణాభివద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.18కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం పనులను చేపడుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, 15వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు.వార్డు కౌన్సిలర్లు,వార్డు ఇంఛార్జీలు తమ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను, అపరిష్కతంగా ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అన్నారు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. వానాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై దష్టి పెట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మున్సిపల్ డీఈ సాయిలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ సాధినేని స్రవంతి శ్రీనివాస్, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.