Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు శాఖల అధికారులు డుమ్మా
- అంతంతమాత్రంగా హాజరైన ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-పాలకవీడు
ప్రజాసమస్యలపై చర్చించాల్సిన పాలకీడు మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం సాదాసీదాగా కొనసాగింది.22 మంది సర్పంచులకు కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు.వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.ఈ సమావేశాలకు రాకపోవడం వల్ల సర్పంచులు అన్ని విధాల నష్టపోతారని ఎంపీపీ గోపాల్‌నాయక్ ఆక్షేపించారు.హాజరైన కొన్ని శాఖల అధికారులతో.. వివరణాత్మక సమాధానాలు సమావేశం రాబట్టింది.మన ఊరు- మన బడి కింద.. రెండు ఉన్నత, ఎనిమిది ప్రాథమిక పాఠశాలల్లో పనులు జరుగుతున్నట్లు, ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతున్న పాఠశాలలకు.. ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు.1 నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వలన.. పాఠ్యపుస్తకాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని ఎంఈఓ శత్రునాయక్ సమావేశం దృష్టికి తెచ్చారు.పాఠశాలల్లో పారిశుధ్యం బాధ్యతను తాము తీసుకోలేమని గ్రామాల సర్పంచులు వాపోయారు.. ఎప్పటిలాగానే అటెండర్ నియమించుకోవాలని ఏకగ్రీవంగా కోరారు.పశుగ్రాసం కొరత తీర్చడానికి గడ్డివిత్తనాలు, కటింగ్మిషన్స్ని సబ్సిడీ మీద అందిస్తున్నామని పశుసంవర్ధక శాఖ తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా 104 వాహనాలు నిలిచిపోవడంతో ఆ సేవలను గ్రామాల్లో ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ద్వారా అందిస్తున్నట్లు వైద్యాధికారి నాగయ్య తెలిపారు.నూతనంగా ఏర్పడిన మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని ఎంపీపీని సర్పంచ్ కోరారు.మండల పరిషత్ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ల కొరత ఉండడంతో మండలంలో ఉపాధిహామీ సేవలు కుంటు పడుతున్నాయని.. సంబంధిత అధికారులను సంప్రదించి ఈ కొరతను పూడ్చాలని సమావేశంలో నిర్ణయించారు. మండలకేంద్రం నుండి సజ్జాపురం గ్రామానికి వెళ్లే రహదారిలో ఇబ్బందులను తొలగించాలని, జానపాడు నుంచి మఠంపల్లి వెళ్లే మార్గంలో మంచతండా వద్ద రహదారి విస్తరణ జరపాలని ఎంపీపీ కోరారు. ఎంపీటీసీ దొంగల వెంకటయ్య మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 4 గ్రామాలలో.. కరెంటు సమస్యలను.. పల్లె ప్రకతి లో భాగంగా నైనా పరిష్కరించాలని రాతపూర్వకంగా కావలసిన పనులను ఏకరువు పెట్టారు.గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో వరికొయ్యలకు నిప్పుపెట్టడం వలన..అపార నష్టం జరుగుతుందని,హరితహారం ద్వారా పెరిగిన రోడ్ల వెంట చెట్లు కాలిపోతున్నాయని సమావేశం దష్టికి వచ్చింది.అన్ని గ్రామాల్లో డప్పు చాటింపు వేయించి.. అవగాహన కల్పించాలని సర్పంచులను ఎంపీఓ దయాకర్ కోరారు.మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ బొత్తలపాలెం సర్పంచ్.. భోగాల వీరారెడ్డి.. డెడ్ బాడీ ఫ్రీజర్.. ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.రూ.18 లక్షలతో సీసీ డ్రయినేజీల నిర్మాణం, రూ.4 లక్షలతో మట్టి రోడ్డు నిర్మాణానికి.. తీర్మానాలు ఇచ్చినట్లు ఎంపీపీ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రీడామైదానాల నిర్మాణం, 5వ విడత పల్లె ప్రకతి పనులను మండలంలో చేపట్టినట్లు బొత్తలపాలెంతో సహా కొన్నింటిని త్వరలోనే ప్రారంభిస్తామని ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని రోడ్డుకు ఇరువైపులా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను చట్ట ప్రకారం తీయాల్సి వస్తుందని.. విధి విధానాలు త్వరలోనే స్పష్టం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్, పాలకీడు,బొత్తలపాలెం, సజ్జాపురం,రావిపాడు సర్పంచులు, ఎంపీటీసీలు మీసాల ఉపేందర్,విజయ,వెంకటయ్య,కార్యాలయ సూపరింటెండెంట్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.