Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎస్పీని కలిసిన లారీ అసోసియేషన్ నాయకులు
నవతెలంగాణ-కోదాడరూరల్
లారీ యజమానుల పట్ల పోలీసులు సానుకూలంగా స్పందించి సహకరించాలని పలువురు లారీ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.శుక్రవారం కోదాడ కు నూతనంగా వచ్చిన డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా,పూలబొకేతో ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వారి దష్టికి తీసుకెళ్లారు. కరోనా వచ్చిన నాటి నుండి రవాణారంగం పూర్తిగా దెబ్బతిన్నదని ముఖ్యంగా లారీ యజమానులు రోజురోజుకు పెరుగు తున్న ఇంధన ధరలతో కష్టాల్లో ఉన్నారన్నారు.పోలీస్ చలానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నా మన్నారు.పోలీసు వారు లారీ యజమానులకు సహకరించాలని డీఎస్పీని కోరారు.ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ లారీ యజమానుల నిబంధనల మేరకు రవాణా రంగాన్ని అభివద్ధి చేసుకోవాలన్నారు.లారీ యజమానులకు అన్ని వేళలా పోలీసు శాఖ నుండి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అవులరామారావు, కోదాడ లారీ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కోల్లు ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ ఎండి రఫీ, షేక్ జానీ, దొంగరి సుధాకర్, నర్సింహారావు, బుడిగం నరేష్, ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.