Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూటికి నూరు శాతం పూర్తయిన మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం
- అధికారులను,ప్రజాప్రతినిధులను అభినం దించిన కేంద్రబందం
- అభివద్ధికి ఆదర్శంగా నిలిచిన జక్కులవారిగూడెం
నవతెలంగాణ-మునుగోడు
కేంద్ర ప్రభుత్వం గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌లో చేపట్టిన పనులకు జక్కులవారిగూడెం రూపురేఖలు మారాయని స్వచ్ఛ భారత్ మిషన్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఉమా శంకర్‌పాండే, రాష్ట్ర ప్రతినిధి ఎస్.సుశాంత్ బారిక్ అన్నారు.శుక్రవారం మండలకేంద్రంలోని జక్కులవారి గూడెంలో స్వచ్ఛభారత్ కేంద్ర బందం గ్రామంలో స్వచ్ఛభారత్ ద్వారా చేపట్టిన వీధుల్లో పరిశుభ్రత, కంపోస్ట్ షెడ్, మరుగుదొడ్లనిర్మాణం, ఇంకుడుగుంతల నిర్మాణపనులను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు నూటికి 100 శాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టేందుకు కషి చేసిన సర్పంచ్, కార్యదర్శిని అభినందించారు.పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా సంపూర్ణఆరోగ్యంగా ఉంటారని ,అందుకు గ్రామంలోని ప్రజలు నిరంతరం తమ వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో తడి,పొడి చెత్తను వేర్వేరుగా వేసినట్లయితే సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు ఆ చెత్త ఎంతో దోహద పడు తుందన్నారు. జక్కులవారిగూడెం గ్రామాన్ని జిల్లాలోని ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకొని, గ్రామాలలో అభివద్ధి పనులను చేపట్టాలని సూచించారు .పరిశీలనకు వచ్చిన కేంద్ర,రాష్ట్ర బృందాల ప్రతినిధులను అధికారులు, ప్రజాప్రతినిధులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, ఎంపీవో సుమలత, సర్పంచ్ జక్కల శ్రీనుయాదవ్, స్వచ్ఛభారత్ అధికారులు మోహినుద్దీన్, శంకర్‌బాబు, కార్యదర్శులు ఎస్.మురళిమోహన్, కొత్త ప్రణీత, మానస, ఉపసర్పంచ్ జక్కల నర్సింహ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.