Authorization
Thu April 03, 2025 10:37:11 am
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-నేరేడుచర్ల
రైౖతురుణమాఫీ విషయంలో టీఆర్ఎస్ రైతులను మోసగించిదని,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటిస్తామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.మండలంలోని వైకుంఠాపురం, ఫత్తేపురం, మేడారం, బక్కయ్యగూడెం గ్రామాల్లో శుక్రవారం ఉత్తమన్న రైతు భరోసాయాత్ర పేరుతో రచ్చబండలో పాల్గొని మాట్లాడారు.రాజీవ్‌గాంధీ వర్ధంతి మే 21 నుండి సుమారు మూడు వందల ఇరవై గ్రామాల్లో రచ్చబండ రైతు భరోసా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ,హుజూర్నగర్ నియోజకవర్గంలో సుమారు 50 వేల మెజార్టీతో గెలుస్తుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు.తమ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు అయిన మరుక్షణమే రైతుల కు ఏకకాలంలో రెండు లక్షలు రుణ మాఫీ చేస్తామని, భూమి లేని రైతుకూలీలు లకు సంవత్సరానికి 12000 ఇస్తామని పంట బీమా క్రాఫ్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి తెస్తామని వరి కొనుగోలు విషయంలో టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని కనీస మద్దతు ధర 1960 కూడా కొనలేక పోయారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధాన్యం క్వింటాకు 25 వందలు కనీస ధర చొప్పున కొంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పొదుపు మహిళా సంఘాల సభ్యులు 12 శాతం వడ్డీతో రుణాలు చెల్లిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు మహిళాసంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని, రైతుబంధు కంటే మరింత మెరుగైన పథకంతో కౌలు రైతులకు సైతం సంవత్సరానికి 15000 ఇస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మేడారం గ్రామం నుండి టీిఆర్‌ఎస్‌కు సంబంధించిన ఏడు కుటుంబాలవారు కాంగ్రెస్ చేరాయి.ఈ కార్యక్రమంలో ఎన్నారై జైపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు కొనతం చిన్నవెంకటరెడ్డి, కౌన్సిలర్ బచ్చలకూరి ప్రకాష్,కట్టా రామారావు, పాల్వాయి కష్ణమూర్తి, తాళ్ల కష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, పాండునాయక్ పాల్గొన్నారు.