Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
ప్రభుత్వం పెంచిన ఆర్టీసీచార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.రెండు నెలల్లోనే రెండు సార్లు ఆర్టీసీచార్జీలను,బస్పాస్ ధరలను ప్రభుత్వం పెంచిందని విమర్శించారు. మళ్లీ డీజిల్ సెస్ పేరుతో గురువారం నుండి విద్యార్థుల బస్పాస్లతో పాటు పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సర్వీసులలో టికెట్చార్జీలను విపరీతంగా పెంచడం టీిఆర్ఎస్ ప్రభుత్వానికి తగదని పేర్కొన్నారు.టికెట్ ధరల పెంపుపేరుతో పేదల మీద భారాలు వేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ విషయంలో లాభ,నష్టాల వైఖర్ని విడనాడి ప్రజలపై భారాలు వేయొద్దన పేర్కొన్నారు. వార్షికబడ్జెట్లో రెండు శాతం నిధులు కేటాయించి ఆర్టీసీని బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.