Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎపీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం .అడివయ్య
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
వికలాంగుల కార్పొరేషన్ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ వేదిక రాష్ట్ర కమిటీ సమావేశాలు యాదగిరిపల్లి సాయి శివ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధక్షులు కె.వెంకట్ అధక్షతన నిర్వహించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్టించుకోవడం లేదని విమర్శించారు . దేశవ్యాప్తంగా ఒకే పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు . రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 3.51 లక్షల ఆసరా పెన్షన్ లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా వికలాంగులు రిజర్వేషన్లు కోల్పోతారని తెలిపారు. ఉపాధిహామీలో వికలాంగులకు పనులు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. వికలాంగుల సమగ్ర అభివద్ధి కోసం వికలాంగులకు ప్రత్యేక పాలసీని తక్షణమే ప్రకటించాలని ,వికలాంగులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ రాష్ట్ర కోశాధికారి వెంకటేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.మధు బాబు రాజు యశోద సాయమ్మ బస్వరాజ్ సహాయ కార్యదర్శులు బలిశ్వర్, దశరథ్ నాగలక్ష్మి ఆరిఫా రాష్ట్ర కమిటీ సభ్యులు సురపంగా ప్రకాష్, కీసర వెంకట్ రెడ్డి, లలిత, శశికళ, బోల్లేపల్లి స్వామి, భుజంగ రెడీ,చంద్రమోహన్, ప్రభు స్వామి, జిల్ల నాయకులు అనుసుజ, ఇంజ పద్మ, రజిత, తదితరులు పాల్గొన్నారు.