Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోటకొండూరు
మండల కేంద్రంలోని ఆరేగుడెం గ్రామంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, శుక్రవారం ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ నర్సరీని కంపోస్ట్ షెడ్, నూతనంగా నిర్మింస్తున్న వైకుంఠ ధామాలను సందర్శించారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ కమిటీ సభ్యుల ఎర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లెలో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. మొక్కలు నాటడం వల్ల ఆక్సీజన్ వస్తుందన్నారు. అంతరం మేడికుంటపల్లి, దిలావార్ పుర్ గ్రామాల్లో ప్రభుత్వ సహకారంతో ఎర్పాటు చేసుకున్న తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. గ్రామీణ విద్యార్థులతో ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువు తో పాటు క్రీడల రంగంలో కూడా చాలా చురుగ్గా పాల్గొనాలన్నారు. వాలీబాల్ ఆటలో పాల్గొని క్రీడలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పైళ్ల ఇందిర సత్యనారాయణ, వైస్ ఎంపీపీ ఇలందుల మల్లేశం, జెడ్పీటీసీ పల్లా వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు బొట్ల యాదయ్య, మార్కెట్ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు భూమండ్ల అయిలయ్య, మండల కో ఆప్షన్ మెంబర్ యండి బురాన్, పీఏసీఎస్ చైర్మెన్ ఎగ్గిడి బాలయ్య, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి సర్పంచ్ బలసిద్దులు, ఉప సర్పంచ్ గాజుల దామోదర, తదితరులు పాల్గొన్నారు.