Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
- మెగా రక్తదాన శిబిరం కరపత్రం విడుదల
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రక్త దానం మరొక్కరికి ప్రాణదానమని, మానవత్వంతో రక్త దానం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. ప్రపంచ రక్తదాతాల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త నిర్వాహణలో ఈ నెల 14 న భువనగిరి ఏరియా ఆసుపత్రిలో నిర్వహించే మెగా రక్త దాన శిబిరం కరపత్రాన్ని శుక్రవారం కలెక్టర్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రశాంత్ , జిల్లా మలేరియా అధికారి సుమన్ కళ్యాణ్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మెన్ గుర్రం లక్ష్మినర్సింహారెడ్డి తో కలిసి తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రక్త దానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ప్రాణాన్ని కాపాడిన వారు అవుతామన్నారు. ఒక్క యూనిట్ రక్త దానం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ డైరెక్టర్ కోడారి వెంకటేష్, జంపాల అంజయ్య, వి.పురుషోత్తం రెడ్డి, డి.బాలాజీ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.