Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ- నార్కట్పల్లి
సమిష్టి కృషితోనే గ్రామాలభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని అక్కెనపల్లి గ్రామంలో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివద్ధి పనులకు, 20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మంచినీటి సరఫరా, టాయిలెట్స్, ప్రహారీగోడ ఇతర అభివద్ది పనులకుగాను సుమారు 28 లక్షల రూపాయలతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి నప్పటికీ కేవలం సర్పంచ్ , ఎంపీటీసీ ప్రజా ప్రతినిధులు మాత్రమే అభివద్ధికి పాటుపడతారని అను కోవడం సరికాదన్నారు.
చెత్త పంచాయితీని పరిష్కరించండి
అక్కన పల్లి సర్పంచ్ మాదాసు చంద్రశేఖర్
గ్రామంలో లో తడి పొడి చెత్తను డాక్టర్ ద్వారా సేకరించడం లేదని గ్రామస్తులు సభలో ఎమ్మెల్యే దష్టికి తీసుకు వచ్చారు దీంతో ప్రభుత్వము ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసినప్పటికీ తడి పొడి చెత్తను ఎందుకు సేకరించడం లేదని ఆ గ్రామ సర్పంచ్ ను ఎమ్మెల్యే అడిగారు. దీంతో గ్రామ సర్పంచ్ మా దాస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామంలో రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు స్థలం చూపించిన చోటు డంపింగ్ యార్డును ఏర్పాటు చేశామని దాన్ని గ్రామస్తులు అడ్డుకొని తమపై పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులపై కేసు నమోదు చేసి కోర్టు కు ఆశ్రయించారని తెలిపారు. దీంతో చేసేదిలేక గ్రామంలో తడి పొడి చెత్తను స్వీకరించడం లేదని పేర్కొన్నారు. ఈ చెత్త పంచాయితీని పరిష్కరించమని పదే పదే రెవెన్యూ ,పంచాయతీరాజ్ ,పోలీస్ శాఖ అధికారులకు విన్నవించుకున్నా పరిష్కారం దొరకడం లేదన్నారు. ఈ చెత్త పంచాయితీని పరిష్కరించాలని ఆయన ఎమ్మెల్యేను కోరగా గ్రామస్తులందరూ సమిష్టిగా సహకరించి పరిష్కరించాల్సిన అవసరముందని సూచించారు. అధికారులు కేటాయించిన స్థలంలో చెత్తను వేసి తడి పొడి చెత్త వేరు చేసి పొడి చెత్త తో వ్యర్థ పదార్థాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి గ్రామ ఎంపీటీసీ పావని కుమార స్వామి పిఎసిఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి , ఎంపీడీవో గుండ గోని యాదగిరి గౌడ్, ఆర్డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ అరుణ్ కుమార్, టీిఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, నార్కట్ పల్లి ఎంపీటీసీ పుల్లెంల ముత్తయ్య., పంచాయతీ ప్రత్యేక అధికారి ,డాక్టర్ జ్యోత్స్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇద్దయ్య, నాయకులు ఖలీల్, షరీఫ్, మత్స్య కార్మిక సొసైటీ చైర్మెన్ గుడిసె ఇమ్మయ్య ,తదితరులు పాల్గొన్నారు.
పల్లెపహాడ్ గ్రామంలో రూ20 లక్షల అభివద్ధి పనులకు శంకుస్థాపన
మండల పరిధిలోని పల్లెపహాడ్ గ్రామంలో 5వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు శుక్రవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి మాజీ ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి , ఆ గ్రామ సర్పంచ్ కల్మ కొలను రమేష్ రెడ్డి, గ్రామ ఎంపీటీసీ కల్మకొలను లక్ష్మమ్మ మండల ప్రత్యేక అధికారి వెంకయ్య, ఎంపీడీవో జీ యాదగిరి గౌడ్ , ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుణ్ కుమార్ టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
నీటి సమస్యను పరిష్కరించండి
గ్రామంలో లో కష్ణ జలాల సమస్య తీవ్రంగా ఉందని గ్రామంలో సగ భాగం మాత్రమే నీరు సరఫరా జరుగుతున్నాయని గ్రామస్తులు ఎమ్మెల్యే దష్టికి తీసుకొచ్చారు ఇదే విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరుణ్ కుమార్ను వివరణ కోరగా మిషన్ భగీరథ పైపులు పగిలిపోయాయి అని దీంతో సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. నూతన పైపులు వేసేందుకు 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్ దష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.