Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
మండలంలోని మందోళ్ల గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మహతి ఇన్ఫ్రా సర్వీసెస్ కంపెనీలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన హెల్త్ మోబిస్ కు చెందిన డాక్టర్లు కార్మికులకు దంత,కంటి,ఊపిరితిత్తులు,లివర్, టెస్టులను చేశారు.ఈ సందర్భంగా కంపెనీ జియం వైభవ్ నారాయణ పోరే మాట్లాడుతూ ఎండి రవిశంకర్ ఆధ్వర్యంలో కార్మికుల ఆరోగ్యాలను దష్టిలో పెట్టుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్మికులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ కళ్యాణ్ స్వరూప్,హెచ్ ఆర్ శకన్యా, డాక్టర్లు శ్రీకర్,విభూషి తదితరులు పాల్గొన్నారు..